సోషల్ మీడియా ఇంచార్జి.బర్ల కుమార్. నానమ్మ ప్రథమ వర్ధంతిలో పాల్గొన్న పుట్ట మధూకర్
చిత్రపటానికి పూలమాల వేసి .నివాళులర్పించిన మంథని మాజీ ఎమ్మెల్యే… కుటుంబ సభ్యులకు పరామర్శ.
అర్జున్ సమాచారం అక్టోబర్ 28 .రామగిరి రిపోర్టర్..
రామగిరి: పెద్దల జ్ఞాపకాలను స్మరించుకుంటూ రాజాపూర్ గ్రామంలో నిర్వహించిన బర్ల కుమార్ నానమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పాల్గొని నివాళులర్పించారు. రామగిరి మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన రామగిరి మండల సోషల్ మీడియా ఇన్‌చార్జి బర్ల కుమార్ నానమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పుట్ట మధూకర్ ఆమె చిత్రపటానికి పూలు వేసి ,ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బర్ల కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచిన వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని, ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆయన పరామర్శించినట్లు తెలిపారు.
వర్ధంతి కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొని ఆమెకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బర్ల కుమార్ కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించి సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాపరబోయిన భాస్కర్, రొడ్డ శ్రీనివాస్, పుల్లెల కిరణ్, దామెర శ్రీనివాస్, రౌతు సత్తయ్య, మహేందర్, బొంగోని అవినాష్ తదితరులు పాల్గొన్నారు.